మందు కొట్టి కారు నడుపుతూ యాక్సిడెంట్... కష్టాల్లో శ్రీలంక టెస్ట్ కెప్టెన్ దిముత్ కరుణరత్నె!

  • కష్టాల్లో పడిన దిముత్ కరుణరత్నె
  • ఆటోను ఢీకొట్టిన టెస్ట్ జట్టు కెప్టెన్
  • వారంలో కోర్టుకు హాజరు పరిచే అవకాశం
శ్రీలంక క్రికెట్ టెస్ట్ జట్టు కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె కష్టాల్లో పడ్డాడు. మందు కొట్టి వాహనం నడుపుతూ వెళ్లి, ఓ ఆటోను ఢీకొట్టాడు. తెల్లవారుజామున 5.40 గంటలకు కొలంబోలో ఈ ఘటన జరుగగా, కరుణరత్నెను పోలీసులు అరెస్టు చేసి, ఆపై బెయిల్ మీద విడుదల చేశారు. మరో వారం రోజుల్లో కరుణరత్నెను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఈ అరెస్టుతో దిముత్ క్రికెటర్ కెరీర్ ప్రభావితం కావచ్చని అంచనా. కాగా, గడచిన ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ లో కరుణరత్నె కెప్టెన్సీలో శ్రీలంక అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. టెస్ట్ ల్లో విజయంతో వన్డేలు, టీ-20లకూ అతన్నే కెప్టెన్ గా నియమించాలన్న డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఇలా పోలీసు కేసులో ఆయన చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Dimuth Karunaratne
Cricket
Sri Lanka
Test Cricket

More Telugu News